Thursday, 24 September 2026 03:33:33 PM

ఎన్నికల ముందు కాళ్ళు మొక్కుడు గెలిచాక.. గాలికి వదిలేసుడు...?

నమ్మిన సింగరేణి కార్మికుడిని నట్టేట ముంచిన వైనం...ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా...ఎన్నికల చివరి సమయంలో ఓ నాయకుడిని వెంటాడుతున్న వివాదాలు..రామగుండంలో తప్పుడు ప్రచారాలతో గందరగోళం...

Date : 27 November 2023 09:37 PM Views : 568

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఓవైపు ఎన్నికల ప్రచార సమయం చివరి నిమిషం చేరుకున్న తరుణంలో ఓ పార్టీకి చెందిన నేతకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.. అయితే సదరు నేతకు సంబంధించి ఇప్పటికే రామగుండం ఎరువుల కర్మాగారంలో మోసపోయిన నిరుద్యోగులు ఇంటింటికి తిరుగుతూ తమకు జరిగిన అన్యాయంపై వివరిస్తూ సదురు నాయకుడికి ఓటు వేయద్దని ప్రచారం చేస్తూన్న నేపథ్యంలో మరో వివాదం వెంటాడుతున్నట్లు తెలుస్తుంది.. కొంతమంది కిందిస్థాయి నాయకులు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లతో నవ్వుల పాలు కావాల్సిన పరిస్థితి నెలకొంటుందని పలు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.. అయితే కొంత మంది తన అనుచరులు తెలిసి తెలియని అజ్ఞానంతో అనవసరమైన వాటికి స్పందించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతూ రామగుండం నియోజకవర్గంలో వివాదాలకు నీలయంగా తెరతీస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే సదురు నేతకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా సదురు నేతకు రామగుండం ఎన్నికల ప్రచారంలో మహిళల నుండి భంగపాటు ఎదురుకోవడంతో పాటు నవ్వుల పాలవుతున్నట్లు పలువురు గుసగుసలాడుకుంటున్నారు.. ఏది ఏమైనా రామగుండం నియోజకవర్గ ప్రజల తీర్పు రానున్న ఎన్నికల్లో వైవిధ్యంగా ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :