Thursday, 24 September 2026 10:19:06 PM

మా ఉపాధ్యాయులు మాకే కావాలని విద్యార్థుల నిరసన...

ఎందుకు బదిలీ చేసారని అధికారులను నిలదీసిన విద్యార్థులు

Date : 28 December 2024 04:09 PM Views : 680

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సిద్దిపేట జిల్లా : మా ఉపాధ్యాయులు మాకే కావాలని విద్యార్థులు పాఠశాల ముందు విన్నూతన రీతిలో నిరసన తెలిపిన సంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక‌ మండలంలోని క‌స్తూర్బా బాలిక‌ల పాఠ‌శాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఎందుకు బదిలీ చేసారని పాఠ‌శాల గేటు వ‌ద్ద మెట్ల‌పై భీష్మించు కూర్చుని ఆందోళ‌న చేపట్టారు. మేమొ ఓప్పుకోం.. మ‌ళ్లీ మా ఉపాధ్యాయులను ర‌ప్పించండి.. మా టీచ‌ర్లు మాకే కావాలి అంటూ పాట‌లు పాడుతూ త‌మ నిర‌స‌నను వ్య‌క్తం చేశారు. వేరే పాఠ‌శాల‌ల ఉపాధ్యాయులను ఎందుకు ఇక్క‌డికి పంపారు.. మా టీచ‌ర్ల‌నే మ‌ళ్లీ మాకు పంపండి అంటూ డిమాండ్ చేశారు. దీంతో విష‌యం తెలుసుకున్న మండ‌ల విద్యాధికారి ప్ర‌భుదాస్ అక్క‌డికి చేరుకొని విద్యార్థుల‌ను స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :