Saturday, 26 September 2026 08:05:39 PM

సీనియర్ అసిస్టెంట్ లు, గిర్థావార్ ల బదిలీ

Date : 06 April 2023 04:30 PM Views : 557

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : జిల్లాలో పరిపాలన సౌలభ్యం దృష్ట్యా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ లు, ముగ్గురు గిర్థావార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎ.భవాని ప్రసాద్ ను ధర్మారం తహసిల్దార్ కార్యాలయానికి, ధర్మారం తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఎండి. ఖాజా పాషా ను రామగుండం తహసిల్దార్ కార్యాలయానికి బదిలీ చేశారు. ధర్మారం తహసిల్దార్ కార్యాలయంలో గిర్థావార్ -2 గా పని చేస్తున్న వి.నవీన్ చంద్ర ను మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా, పెద్దపల్లి తహసిల్దార్ కార్యాలయం లో గిర్థావార్ -2 గా పనిచేస్తున్న టి.అంజయ్య ను ధర్మారం తహసిల్దార్ కార్యాలయం లో గిర్థావార్- 2 గా , రామగిరి తహసిల్దార్ కార్యాలయంలో గిర్థావార్- 2 గా పని చేస్తున్న డి.సతీష్ కుమార్ ను పెద్దపల్లి తహసిల్దార్ కార్యాలయం లో గిర్థావార్- 2 గా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :