ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా వాట్సాప్ సేవలు ఆగిపోయాయి. యాప్ నుంచి సందేశాలు వెళ్లకపోవడం ఓ సమస్య అయితే కొన్ని మెసేజ్లు వెళ్లిన ఆ మెసేజ్ లు అవతలి వ్యక్తికి కనిపించకపోవడం మరో సమస్యగా మారింది. ఇది సాంకేతిక సమస్యగా నిపుణులు తేల్చేశారు. సర్వర్ స్టోరేజ్ కానీ, సర్వర్ ని మార్చడం కానీ చేసినప్పుడు వాట్సాప్ లో టెక్నికల్ గా ఇలాంటి సాంకేతిక సమస్యలు మార్పులు చోటు చేసుకుంటాయని వాట్సాప్ మాతృ సంస్థ అయిన మోటా తెలిపింది. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది
Admin
Aakanksha News