ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం రాత్రి 1.20 ప్రాంతంలో దొంగతనానికి పాల్పడ్డ వారిని పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా 10 టీమ్ లు ఏర్పాటు చేశామని జగిత్యాల డిఎస్పీ ప్రకాష్ తెలిపారు. సంఘటన జరిగిన తీరును పరిశీలించడానికి శుక్రవారం ఆలయానికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు..రాత్రి 1.20 నిమిషాలకు ఆలయం వెనుక వైపు ద్వారం నుండి ముగ్గురు వ్యక్తులు చొరబడి శఠగోపం, రామరక్ష, శటారిలను ఎత్తుకెళ్లారని తెలిపారు.ఉత్సవ విగ్రహాలను తాకలేదని, దొంగిలించిన సొమ్ము విలువ ఈవో దరఖాస్తు ఇచ్చిన అనంతరం వెల్లడిస్తామని అన్నారు.రాత్రి కొండగట్టులో ఒక ఏ ఎస్ ఐ, నలుగురు సిబ్బంది ఉన్నారని, వారి కళ్ళు తప్పి దొంగతనానికి పాల్పడ్డారని చెప్పారు. వీలైనంత తొందరలో దొంగలను పట్టుకుంటామని పేర్కొన్నారు.
Admin
Aakanksha News