Tuesday, 23 June 2026 12:51:30 AM

విచ్ఛిన్నకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి

రామగుండం ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్

Date : 17 September 2023 02:35 PM Views : 481

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజున రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు.జాతీయ సమైక్యతా దినోత్సవంను పురస్కరించుకొని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరై తెలంగాణ తల్లి, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, జాతీయ పతాకంను ఆవిష్కరించారు. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి, తెలంగాణ తల్లి, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాల మూలంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడంతో ప్రజలు స్వేచ్ఛ వాయువులతో జీవితమును ప్రారంభించారన్నారు. 1948 సెప్టెంబర్ 17న ఆనాటి హైదరాబాద్ సంస్థానం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిందన్నారు. తెలంగాణ జాతీయతా సమైక్యత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. కొమురం భీం, చాకలి ఐలమ్మలాంటి ఎంతోమంది వీరుల వీరోచిత పోరాటాలను, వారి త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ సువిశాల భారతదేశంలో కులమతాలకతీతంగా అరమరికలు లేకుండా అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తుంటే.. కొంతమంది కులాలు,మతాల పేరిట ప్రజల మధ్యలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలందరూ ఏకమై కుట్రదారుల కుతంత్రాలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రంలో ప్రజలు సంక్షేమ జీవనాన్ని పొందలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు ఉచిత ఆశ్రమ విద్య, నిరుపేదల ఆరోగ్య సంరక్షణ కోసం మెడికల్ కళాశాలలను, యువత ఉపాధి కోసం అనేక దేశవిదేశ సాప్ట్ వేర్ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆసరా పెన్షన్లు ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టారని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పదేళ్లలోనే వందేళ్ల ప్రగతిని సాధించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని, ప్రజలందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమం తనకు రెండు కళ్ళులాంటివన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నతంగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ పాలనను బలపరిచి, హ్యాట్రిక్ సీయంగా చేసి, రాబోయే కాలంలో జరిగే అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. అమరవీరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, అంతర్గాం జడ్పిటిసి అముల నారాయణ, కార్పొరేటర్లు కొమ్ము వేణుగోపాల్, దొంత శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, అడ్డాల గట్టయ్య, బాల రాజ్ కుమార్, జంగంపల్లి సరోజన, కల్వచర్ల కృష్ణవేణి, జనగామ కవితా సరోజిని, నాయకులు మాదాసు రామ్మూర్తి, నారాయణదాసు మారుతి, అచ్చ వేణు, జాహెద్ పాషా, గుంపుల ఓదెలు యాదవ్, పిల్లి రమేష్, కలువల సంజీవ్, చెలుకలపల్లి శ్రీనివాస్, కాల్వ శ్రీనివాస్, తోకల రమేష్, సింహాచలం రత్నాకర్, సలీం బేగ్, బెందె నాగభూషణం గౌడ్, దండు రవి, బండ రాజు, గడ్డం నారాయణ, డాక్టర్ శ్రీహరి, కొర్రి ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :