Wednesday, 23 September 2026 11:22:01 AM

చికిత్స పొందుతూ నందమూరి తారక రత్న మృతి

Date : 19 February 2023 12:48 AM Views : 512

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నందమూరి తారకరత్న కన్నుమూశారు. టీడీపీ యువ సారధి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించారు మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తారక రత్నలో ఎలాంటి మార్పు లేదు.ఆయన శనివారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :