Saturday, 18 April 2026 09:23:15 AM

నిజామాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో అరుదైన కవలల వివాహం...

Date : 24 February 2026 06:13 PM Views : 147

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : నిజామాబాద్‌ జిల్లాలో అరుదైన మరియు విశేషమైన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మగ కవలలు ఇద్దరు ఆడ కవలలను ఒకే ముహూర్తంలో వివాహం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజున జరిగిన ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.కామారెడ్డి జిల్లా కేంద్ర శివారు లింగాపూర్‌లోని ఓ కల్యాణ మండపంలో ఈ అరుదైన వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్‌కుమార్‌, వినయ్‌కుమార్‌లు కవల సోదరులు. వీరికి ఇదే జిల్లా తాడ్వాయి మండలం దేమీకలాన్ గ్రామానికి చెందిన కవల సోదరీమణులు కుమ్మరి కీర్తన, కీర్తిలతో పెద్దలు వివాహం నిశ్చయించారు.పెద్దల సమక్షంలో, బంధుమిత్రుల మధ్య వేద మంత్రాల నడుమ ఒకే వేదికపై ఒకే ముహూర్తంలో రెండు జంటలు ఒక్కటయ్యాయి. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వివాహ వేదిక వద్ద సందడి నెలకొని, కవలల పెళ్లి చూడటానికి వచ్చిన వారితో కళకళలాడింది.నూతన దంపతులు విజయ్‌కుమార్‌-కీర్తన, వినయ్‌కుమార్‌-కీర్తి ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన కవల సోదరులు, కవల సోదరీమణులతో వివాహం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. ఈ వివాహం జిల్లా వ్యాప్తంగా విశేషంగా చర్చనీయాంశమైంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :