Saturday, 18 April 2026 09:07:20 AM

ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం వేడుకలు...

Date : 31 October 2025 12:47 PM Views : 221

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కుమనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పాపన్నపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పోలీస్ బృందం ఆధ్వర్యంలో ఈ ఉదయం "ప్రేమతో ఓకే రన్" కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ ఐక్యత నినాదాలతో, దేశభక్తి జెండాలతో రన్ ప్రారంభమైంది. పాల్గొన్నవారందరూ “జై సర్దార్ వల్లభాయ్ పటేల్”, “జై పాపన్నపేట”, “జై పోలీస్ బృందం” అంటూ నినాదాలు చేస్తూ దేశ సమైక్యతకు తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ...సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు అప్రతిహతంగా పోరాడిన మహానేత. ఆయన ఆలోచనలు, ఆత్మస్ఫూర్తి మనందరికీ ప్రేరణ కావాలి. ఈ రన్ ద్వారా యువతలో దేశభక్తి, ఐక్యత భావన పెంపొందించడమే మా లక్ష్యం” అని అన్నారు.రన్ అనంతరం పాల్గొన్న వారికి పోలీసు అధికారులు సర్టిఫికెట్లు, అభినందనలు అందజేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు, విద్యార్థులు సమన్వయంగా సహకరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :