Friday, 25 September 2026 05:23:25 PM

రాజకీయాలకు రిటైర్మెంట్ లేదని స్పష్టం చేసిన మల్లారెడ్డి...

Date : 11 August 2025 06:36 AM Views : 556

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జపాన్‌లో ఎప్పటికీ రిటైర్మెంట్ అనే పద్ధతి లేనట్లే, నాకు కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు” అని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఓ జర్నలిస్టు మిత్రుడు వేసిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.విద్యాసంస్థలను దేశవ్యాప్తంగా స్థాపిస్తానని తాను చెప్పానేగానీ, రాజకీయాలను వదిలేస్తానని ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. “బీజేపీలో గానీ, తెలుగు దేశం పార్టీలో గానీ చేరే ప్రసక్తే లేదు. నేను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతాను” అని మల్లారెడ్డి హామీ ఇచ్చారు.రాజకీయాల్లో చురుకుగా ఉంటూ, పార్టీ బలపడేందుకు కృషి చేస్తానని, ప్రజా సేవలో నిరంతరం కొనసాగుతానని కూడా ఆయన స్పష్టంచేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :