Saturday, 26 September 2026 06:16:12 PM

ఏకాదశి పర్వదినాన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మండల దీక్ష చారిటబుల్ ట్రస్ట్ గిరిప్రదక్షిణ

Date : 21 July 2025 07:45 PM Views : 265

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / యాదాద్రి భువనగిరి జిల్లా : ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి మండల దీక్ష చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గిరి ప్రదక్షణ ఆసాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ స్వామివారి భజనలతో మారు మోగింది. ఉదయం 6 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద శ్రీ స్వామివారి పాదాల చెంత నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షణ గంటపాటు కొనసాగింది. ఈ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు గంగు సత్తిరెడ్డి, ఉపాధ్యక్షుడు, ఈదులకంటి రమేష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి పబ్బాల శ్రీరాములు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ పంచనారసింహుని నామస్మరణతో భక్తుల జీవితాలు పంచామృతంలా మారుతాయని అన్నారు. ప్రతి శనివారం, ప్రతి నెల శ్రీ స్వామి వారి స్వాతి నక్షత్రం రోజున, ఏకాదశి పర్వదినం రోజున, అలాగే శ్రీ స్వామివారి ప్రత్యేక సందర్భాలలో కూడా గిరి ప్రదర్శన కొనసాగించడం జరుగుతుందన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :