Sunday, 13 September 2026 02:00:12 AM

ముఖ్యమంత్రి వచ్చిన రోజే నా పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటా...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పెళ్లికి తీసుకురావాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం...

Date : 22 April 2025 05:59 PM Views : 675

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / ఖమ్మం జిల్లా : సాధారణంగా ఏమైనా సమస్యలు ఉంటేనో లేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనో ఆయా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. కానీ ఓ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ యువజన మండల యూత్ నాయకుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకు ఇచ్చిన వినతి పత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ కు కారేపల్లి మండలం మేకల తండాకు చెందిన గణేష్ కాంగ్రెస్ యువజన మండల యూత్ నాయకుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ మధ్యనే గణేష్ కు పెళ్లికూదిరి నిశ్చితార్థమైంది. అయితే తన పెళ్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకురావాలని, ముఖ్యమంత్రికి ఎప్పుడు కుదిరితే అప్పుడే ముహూర్తం పెట్టుకుంటానని వినతి పత్రంలో రాసి ఎమ్మెల్యేకు అందజేశారు. అయితే ఈ వినతి పత్రంపై ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ సింగరేణి మండల నాయకుడి వివాహానికి హాజరు కావాలని, ఇంపార్టెంట్ లీడర్, ప్లీజ్ డేట్ ఫిక్స్ అని వినతి పత్రం పై రాసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :