Friday, 25 September 2026 06:07:58 PM

అసెంబ్లీలో ఈసారి బడ్జెట్ లో నైనా విద్యా వైద్యానికి 40% నిధులు కేటాయించాలి..

Date : 15 March 2025 06:15 PM Views : 397

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అసెంబ్లీలో ఈసారి బడ్జెట్ లో నైనా విద్యా వైద్యానికి 40% నిధులు కేటాయించాలని మేడ్చల్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్ డిమాండ్ చేసారు. శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్ని ఉచితాలు ఇచ్చినా బూడిదల పోసిన పన్నీరే"నాన్నారు. ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం రూపాయి కూడా ఖర్చు కాకుండా అందించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఉచిత పథకాలతో అభివృద్ధి జరుగుతది అంటే ఇప్పటికే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నారు. తెలంగాణలో 93 లక్షల తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నాయి.. ఇంకా 20 లక్షల కుటుంబాలు తెల్ల రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నారని, డబల్ బెడ్రూంల కోసమో ఇందిరమ్మ ఇళ్ల కోసమో 20 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నారు అంటే" అభివృద్ధి జరగ లేదని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :