ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మేదక్ జిల్లా : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం స్కందమాత (మహాలక్ష్మి దేవి) రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా వేద పండితులు రాజగోపురంతో పాటు గోకుల్ షెడ్‌లో అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఉత్సవాల్లో భాగంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రాకపోకల కోసం పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో విస్తృతమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు..ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు దసరా మహోత్సవం వరకు మరింత వైభవంగా కొనసాగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Admin
Aakanksha News