Monday, 10 August 2026 01:11:56 PM

బొప్పారం, గుడూరు గ్రామాల్లో డెంగ్యూ పర్యవేక్షణ...

అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి పర్యటన, ప్రజలకు అవగాహన కల్పన....

Date : 30 July 2025 06:28 PM Views : 365

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కాటారం(ఆకాంక్ష న్యూస్) : కాటారం మండల పరిధిలోని బొప్పారం మరియు గుడూరు గ్రామాలలో ఇటీవల డెంగ్యూ కేసు నమోదవ్వడంతో జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆమెతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్‌చార్జ్ అధికారి డాక్టర్ శ్రీదేవి, స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక కూడా గ్రామాలను సందర్శించారు.డెంగ్యూ పాజిటివ్ కేసు వెలుగులోకి రావడంతో రెండు రోజుల క్రితమే గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించగా, తాజాగా ఈ పర్యటనలో అధికారులు ప్రజలకు వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీటిని తొలగించడం వంటి సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎపిడమిక్ టీం సభ్యులు, సబ్ యూనిట్ అధికారులతో కలిసి డ్రైడే నిర్వహించారు. దోమల ఉత్పత్తి తగ్గించేందుకు గ్రామంలో దోమల మందు పిచికారి చేపట్టారు. ప్రజల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిర్మల, హెల్త్ సూపర్వైజర్ పద్మావతి, మహిళా హెల్త్ అసిస్టెంట్ సుజాతల సేవలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :