Tuesday, 11 August 2026 01:45:28 PM

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు...

బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు

Date : 25 March 2025 05:29 PM Views : 515

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారని,15 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆగం చేసి దివాలా తీయించారని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు ఆరోపించారు. ఈ మేరకు పాల్వంచ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మంత్రులు ఒక మాట ఎమ్మెల్యేలు మ‌రో మాట‌, ముఖ్యమంత్రి మరో విధంగా మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి గురి చేస్తున్నారని ఆరోపించారు. వారిలోనే సైక్యత లేఖ ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయి, హుందాతనాన్ని మరిచి దిగజారుడు రాజకీయాలు చేస్తున్న‌ట్లు విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆలా మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు బంధు- రైతు బీమా ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింద‌న్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఎక్కడికి పోయయని ప్ర‌శ్నించారు.రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేసారు. నేను ఎందరో ముఖ్యమంత్రులను చూశానని, కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదని ఎద్దేవా చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :