Friday, 25 September 2026 04:59:52 PM

నైపుణ్యం,అభివృద్ధి సాంస్కృతిక సెంటర్ల ఏర్పాటుకు కృషి..

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్

Date : 01 March 2025 07:22 PM Views : 805

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆది లీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యం అభివృద్ధి మరియు సాంస్కృతిక సెంటర్ల ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందించనున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు.ఆదిలీలా ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ నేతృత్వం లో ప్రతినిధుల బృందం ఈటెల రాజేందర్ ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా ఆదిలీలా ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూయువతను మరియు మహిళలను చైతన్యపరిచి అభివృద్ధి పరిచే దిశగా అది లీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యం అభివృద్ధి మరియు సాంస్కృతిక సెంటర్లను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలలో ప్రావీణ్యం పెంచే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు . మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో ఆదిలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యం అభివృద్ధి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా ఆదిలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ సానుకూలంగా స్పందిస్తూ అందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ సందర్భంగా మార్చి నెలలో ఢిల్లీలోని ఆంధ్ర తెలంగాణ భవన్లో ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాలకు విశిష్ట అతిథిగా ఆహ్వానించారు కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబి శ్రీధర్ మన రామరాజ్యం పార్టీ జాతీయ అధ్యక్షుడు ధణేష్ కాపు ఉద్యమ నేత వేల్పూరి శ్రీనివాస్ పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :