Saturday, 18 April 2026 09:06:47 AM

త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా లేబర్ సెల్ కమిటీలు

ఉమ్మడి జిల్లా లేబర్ సెల్ కమిటీ అధ్యక్షుడు సుడుగు జీవన్ రెడ్డి

Date : 20 August 2025 05:03 PM Views : 271

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నల్లగొండ జిల్లా : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఉమ్మడి జిల్లా లేబర్ సెల్ కమిటీ అధ్యక్షుడు, కార్మిక నేత సుడుగు జీవన్ రెడ్డి తెలిపారు. కార్మిక చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ అసంఘటిత కార్మికులకు చట్టపరమైన భద్రత, ప్రయోజనాలు అందటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత కార్మికులను చైతన్య పరిచేందుకు త్వరలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా కార్మిక మహాసభను నిర్వహించదలచామని, జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులను మహాసభలకు ఆహ్వానిస్తామన్నారు. ఇటీవల గాంధీభవన్ లో లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాగ్ ప్రకాష్ గౌడ్, ఇన్చార్జి జగన్నాథం చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. సుడుగు అనసూర్య_ నర్సిరెడ్డి దంపతులకు జన్మించిన జీవన్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగారు. తండ్రి సుడిగు నర్సిరెడ్డి 1971లో గ్రామపంచాయతీ సభ్యునిగా ఎన్నికయ్యారు. సాంప్రదాయ కాంగ్రెస్ ఉమ్మడి కుటుంబం వారిది. ఆనాడు నలగొండ ఎంపీగా చకిలం శ్రీనివాస్ రావు పోటీ చేసిన హయాంలో... 1989లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. ఎన్నో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు. ఆనాడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుధాకర్ రెడ్డి పనిచేసిన కాలంలోనే..1994 లో మండల యూత్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధ్యక్షుడుగా జీవన్ రెడ్డి మంచి మెజార్టీతో ఎన్నికయ్యారు. 1991లో పెద్ద కందుకూరు లోని గోదావరి ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో కార్మికుడిగా చేరి, కంపెనీలోని కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంస్థ ఐ ఎన్ టి యు సి లో క్రియాశీలకంగా పనిచేశారు. అనేక సందర్భాలలో కార్మికుల న్యాయం కోసం అనేక సమ్మెలు నిర్వహించారు. ఆనాడు కుడుదుల నగేష్ శాసనసభ్యుగా పోటీ చేస్తున్నప్పుడు ఆయన విజయం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా స్వయంగా సైకిల్ ర్యాలీలు నిర్వహించామని చెప్పుకొచ్చారు.2006లో యాదగిరిగుట్ట గ్రామపంచాయతీ సభ్యునిగా భారీ మెజార్టీతో ఎన్నికైన సుడిగు జీవన్ రెడ్డి... 2010లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షునిగా బిక్షమయ్య గౌడ్, హయాంలోనే జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2017 యాదాద్రి భువనగిరి జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షునిగా ఎన్నికై జిల్లాలోని స్థానిక కంపెనీలలో అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి తీవ్రంగా కృషి చేశారు.. తనకు పదవులకాంక్ష కన్నా పార్టీ మరింత బలోపేతం కావాలన్నదే ధ్యేయమన్నారు. మనం క్రమశిక్షణ తో... చిత్తశుద్ధితో, అహర్నిశలు కృషి చేస్తే పార్టీ తప్పకుండా మరింత చేరదీస్తుంది అనడానికి తనకు లభించిన పదవులే సాక్ష్యాధారాలు అని అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని నాయకులు , కార్యకర్తలు,పార్టీ అనుబంధ సంస్థలకు సుడుగు జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :