ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నాగర్‌కర్నూల్ జిల్లా : తాడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రంగంలో దిగిన సంద మల్లయ్య (ప్రజల్లో మల్లన్నగా ప్రసిద్ధి) ప్రచారంలో గాలివానలా దూసుకుపోతున్నారు.రాజకీయాల్లో రెండు దశాబ్దాల అనుభవం, సౌమ్య స్వభావం, అందరితో ఓదార్పుగా మాట్లాడే తీరు మల్లయ్యను ప్రజలకు మరింత దగ్గర చేస్తున్నాయి.అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లయ్య ఇప్పటికే గ్రామంలోని ప్రతి ఇంటికి చేరి ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. ఇటీవల ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం ఆయనకు పెద్ద ఆయుధంగా మారింది. పాన(స్పానర్) గుర్తుపై పోటీ పడుతున్న మల్లయ్యకు గ్రామం నుడికట్టు తెలిసిన నాయకుడిగా మంచి ఆదరణ లభిస్తోంది.ఇతరవైపు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కోళ్ల రమేష్ పోటీ పట్ల ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, వారికి ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థికి రాజకీయ అనుభవం లేకపోవడం మల్లయ్యకు అదనపు లాభంగా మారిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.మల్లయ్య ఎన్నికైతే తాడూరు మండల కేంద్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని ఓటర్ల ముందుకు స్పష్టమైన ప్రణాళికను ఉంచారు. గ్రామంలో తాగునీరు, కరెంటు, రహదారులు, మురుగునీటి పారుదల వంటి సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పూర్తి సహకారంతో గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తానని ప్రజల్లో నమ్మకం కల్పిస్తున్నారు.ఇప్పటికే నాలుగు లక్షల యాబై వేల రూపాయలు గ్రామ పనుల కోసం మంజూరు చేయించగా, మరిన్ని అభివృద్ధి అంశాలపై పట్టుదలగా వత్తిడి చేస్తున్నారు. గ్రామం నుండి అయ్యప్ప దేవాలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2.73 కోట్ల పత్రాలు తెప్పించడం ఆయన దూకుడుకు నిదర్శనం అని పేర్కొన్నారు.గ్రామ యువతకు క్రీడా స్థలం, విద్యార్థుల కోసం అవసరమైన సదుపాయాల్ని ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తానని ప్రజల్లో చెప్తున్నారు. గ్రామ నడిబొడ్డున డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇస్తున్నారు.వ్యవసాయదారుల కోసం ఇరుకైన చెరువు బండ్లు, నక్ష బాటలను ఫార్మేషన్ రోడ్లుగా మారుస్తానని చెబుతూ రైతుల హృదయాలను ఆకర్షిస్తున్నారు. ప్రజల సమస్యలను వింటూ, పరిష్కారాలకు ప్రయత్నిస్తూ “మల్లన్న వస్తే మార్పు ఖాయం” అనే భావాన్ని ఓటర్లలో బలంగా నాటుతున్నారు.12 వార్డులకు బలమైన అభ్యర్థుల ఎంపికలో మల్లయ్య విజయం సాధించడం ఆయన బలాన్ని మరింత పెంచింది. వార్డ్ వార్డ్‌కు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసి, ఓటర్లను నమ్మబలుకుతున్నారు. అభివృద్ధిని కోరుకుంటే మల్లన్నే సరైన నాయకుడని గ్రామస్తులు విశ్వాసంతో చెప్తున్నారు. అధికార పార్టీ ఆదరణ, స్థానిక నేతల సమన్వయం, ప్రజల్లో పెరుగుతున్న మద్దతుతో ఈసారి మల్లయ్య గెలుపు ఖాయమంటూ తాడూరు గ్రామం దిశగా రాజకీయ హవా వీచుతోంది.
Admin
Aakanksha News