Monday, 10 August 2026 05:10:23 PM

ఎస్‌ఎల్‌బిసిలో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన

Date : 02 April 2025 07:57 PM Views : 428

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నాగర్‌కర్నూల్ జిల్లా : ఎస్‌ఎల్‌బిసిలో ప్రమాదం జరిగి 40 రోజులు దాటుతున్న వేళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదం జరగడం అత్యంత బాధకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని.. మరో 15 రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలించారు.అయితే ఈ ప్రాజెక్టును ఎన్ని ఇబ్బందులు ఎదురైన పూర్తి చేస్తామని తెలిపిన మంత్రి ప్రమాద్ంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకుపోగా.. ఇద్దరి మృతదేహాలను ఇప్పటివరకూ బయటకు తీశారు. మిగితా మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :