Thursday, 25 June 2026 08:19:42 PM

మర్రిముచ్చాల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ...

Date : 12 January 2026 01:46 PM Views : 339

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / సిద్దిపేట జిల్లా : గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) కింద మంజూరైన చెక్కులను గ్రామ సర్పంచ్ జంగని రవి పంపిణీ చేశారు. బీసీ కమిషన్ సభ్యురాలు శ్రీమతి రంగు బాలా లక్ష్మీ సహకారంతో పుల్లం రాములుకి రూ.29,000, వంగ ప్రసాద్ రెడ్డికి రూ.24,000 విలువైన చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ జంగని రవి మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ పేదలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పెద్ద ఆసరాగా నిలుస్తోందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా గ్రామస్థాయిలో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బద్దిపడిగా రఘుపతి రెడ్డి, తురాయి నవీన్, వంగ కృష్ణ రెడ్డి, రంగు అయిలేని గౌడ్, వంగ సంజీవరెడ్డి, మంత్రి శ్రీనివాస్‌తో పాటు గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :