Thursday, 25 June 2026 08:16:43 PM

భూపాలపల్లి కేటీకే–5 ఇంక్లైన్ గనిలో అగ్ని ప్రమాదం...

Date : 28 January 2026 09:31 AM Views : 399

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : భూపాలపల్లి పరిధిలోని కేటీకే–5 ఇంక్లైన్ బొగ్గు గనిలో ఉన్న లాంప్ రూమ్‌లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లాంప్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ లైట్లు ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వారు సకాలంలో చేసిన చర్యల వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.లాంప్ రూమ్‌లో పొగలు కమ్ముకోవడంతో కొద్ది సేపటి పాటు గనిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంటలు పూర్తిగా ఆర్పిన అనంతరం పరిస్థితి అదుపులోకి రాగా, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.ప్రాథమికంగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో తలెత్తిన సాంకేతిక లోపమే అగ్ని ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై సంబంధిత గని అధికారులు విచారణ చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :