Saturday, 13 June 2026 05:34:28 PM

అర్హులైన ప్రతి ఒక్క రేషన్ కార్డు ద్వార సన్నబియ్యం

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం

Date : 02 April 2025 08:08 PM Views : 493

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్ ఉగాది రోజున సన్న బియ్యం సరఫర కార్యక్రమం ప్రారంభించిన సందర్బంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గం లో మూసాపేట్ డివిజన్ రేషన్ షాప్ నెంబర్ 3384030 టి కృష్ణారావు గారి రేషన్ షాప్ లో నియోజకవర్గం మరియు డివిజన్ కాంగ్రెస్ పార్టి తరపున కాంగ్రెస్ నాయకులు రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణి కార్యక్రమం ప్రారంబించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు గత బిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ తన పదవీ కాలంలో పేదలకు నాణ్యమైన బియ్యం అందకుండా చేశారని.బి ఆర్‌ ఎస్ పాలనలో పిడిఎస్ బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేయడం ద్వారా రైస్ మిల్లర్లు ధనవంతులయ్యారు అని వారు దానిని కిలోకు రూ.10కి సేకరించి, నాణ్యమైన బియ్యంగా తిరిగి మిల్లింగ్ చేసి, బిఆర్‌ఎస్ హయాంలో కిలోకు రూ.30కి విక్రయించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఆహార భద్రత సంస్థ తరపున రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుల కుటుంబాలు చక్కగా వండిన బియ్యాన్ని తినగలగాలి అని ఉద్దేశం తో ఈ సన్న బియ్యం పథకం ప్రారంభించారు అని అన్నారు. రాష్ట్రంలో సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడo రాష్ట్రంలో మైలురాయని కాంగ్రెస్ ప్రభుత్వం 1982 లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో రేషన్ కార్డు దారులకు కిలో బియ్యం రూ.1.90 అందజేశారు అన్నారు 1983లో ఎన్.టి. రామారావు గారు, 2004 లో వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన కిలోకు రూ.2 బియ్యం పథకం, తరువాత 2014 వరకు రూ.1 బియ్యం పథకం, రాష్ట్రంలో కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కొనసాగించింది అన్నారు. తర్వాత ఏ ప్రభుత్వం చేపట్టని పని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టి అర్హులైన పేదలందరికి సన్న బియ్యం పథకం తో ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా పంపిణి చేస్తున్నారు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు బి బ్లాక్ ప్రెసిడెంట్ తూము వేణు కాంగ్రెస్ నాయకులు సప్పిడి భాస్కర్, ఎల్లేష్ యాదవ్, తూము కొండల్, కాస నర్సింహా యాదవ్, బి. ప్రభాకర్, మల్లేష్ యాదవ్, జోజమ్మ, నరైంహా చారి, ఎండీ నయీమ్, మైసయ్య యాదవ్, శేషుపాల్ సింగ్, బాణాల వెంకటేష్, కర్రేమ్మ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :