Wednesday, 25 February 2026 03:39:59 AM

యాదగిరిగుట్టలో కనులపండువగా బ్రహ్మోత్సవాలు...

Date : 24 February 2026 05:59 PM Views : 10

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు భక్తజన సమూహాల నడుమ అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి జగన్మోహిని అలంకార సేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం నిండా భక్తుల రద్దీ కనిపించగా, ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ రాత్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సేవను వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలిరానున్నారు. ప్రధాన ఆలయ తూర్పు మాడవీధుల్లో ఈ రాత్రి ఎదుర్కోలు ఉత్సవం కూడా నిర్వహించనున్నారు.మంగళవారం నుండి విశేష ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాలు పండుగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి. రేపు యాదగిరీశుడి తిరు కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమాలలో ఆలయ ఈవో భవాని శంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, డీఈవో భాస్కర్ శర్మతో పాటు ఆలయ అధికారులు, వేదపండితులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వర్గాలు తెలియజేశాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :