ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలను పెంచాలని మండల విద్యాధికారి ప్రకాశ్ బాబు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో బడిబాట కార్యక్రమంపై నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన మాట్లాడారు.ప్రతి బడిబయట పిల్లను గుర్తించి, 2.5 నుండి 5 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో, 5 నుండి 9 సంవత్సరాల పిల్లలను ప్రాథమిక పాఠశాలలో, 10 నుండి 15 సంవత్సరాల పిల్లలను ఉన్నత పాఠశాలలో చేర్చాలని సూచించారు. తల్లిదండ్రులు, గ్రామ విద్యాభిమానులు, ఉపాధ్యాయుల సహకారంతో ఈ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే నిర్వహించి పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేరదీయాలన్నారు. 15 సంవత్సరాల పైబడిన డ్రాప్ అవుట్ పిల్లలను మండల కేంద్రంలోని ఓపెన్ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, కాంప్లెక్స్ హెచ్ఎం బండం రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు మహేష్, కల్పన, ఉపాధ్యాయులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News