Saturday, 26 September 2026 06:19:44 PM

పేదల బాగోగులే మా ప్రభుత్వ ప్రాధాన్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

Date : 17 July 2025 02:19 PM Views : 416

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మేదక్ జిల్లా : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం సాయి కృష్ణ ఫంక్షన్ హాల్‌లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆహార భద్రత పథకాలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...పేద ప్రజల బాగోగులే మా ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేర్చుతుంది. ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తాం” అని స్పష్టం చేశారు.ప్రతి లబ్ధిదారుడు 600 స్క్వేర్ ఫీట్స్‌లోపు ఇంటిని నిర్మించుకోవాలని. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తాం” అని హామీ ఇచ్చారు.మహిళల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని కొనియాడుతూ, ఇంద్ర మహిళ శక్తి పథకాన్ని ప్రస్తావిస్తూ ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ముందుకు వస్తున్నారు. స్వయం శక్తితో చిన్నతన బిజినెస్‌లు నిర్వహిస్తూ తమ కుటుంబాలను ఆదుకుంటున్నారు” అని మంత్రి ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :