Saturday, 27 June 2026 06:41:18 PM

గోదావరిఖని లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం...

Date : 27 March 2026 02:21 PM Views : 467

ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని పట్టణంలోని కాకతీయ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భద్రాచలం తరహాలో గత 17 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతున్న ఈ మహోత్సవం ఈ ఏడాది 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.ఆలయ ప్రధాన అర్చకులు బూర్ల గణేష్ ఆధ్వర్యంలో శుక్రవారం అభిజిత్ లగ్నంలో వేదమంత్రాల నడుమ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. నూతి అంబాదాసు, నెల్లి లక్ష్మీనారాయణ, పవన శర్మ, ఆడేపు శ్రీరాములు, చాణక్య శర్మ, బండారి రాజమల్లు, శ్రీరాముల శర్మ తదితర వేద పండితులు పాల్గొని పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. తమ కుటుంబాల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కోసం సీతారాముల సాక్షిగా మొక్కులు చెల్లించారు. తెలంగాణ రాష్ట్రం, దేశంలోని సమస్త ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు దాట్ల జేమ్స్ రెడ్డి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య యాదవ్, బారసా నాయకులు నీరటి శ్రీనివాస్, గొర్రె నర్సింగరావు, మొలుగూరి మహేష్, కాకతీయ నగర్ బస్తి వాసులు ఉప్పరి మల్లమ్మ, ఆగయ్య, గొర్రె రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :