Wednesday, 13 May 2026 05:39:38 PM

ఓ అధికారికి ఆది నుంచి అహంభావమే వివాదాస్పదం..!

ఆయన చెప్పింది వింటే ఓకే...లేదంటే వారు ఎవరైనా సరే ఆయన ముందు బలదూరే...!

Date : 05 November 2025 03:31 PM Views : 832

ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక వింత జరుగుతుంది,ఆయన ఎప్పుడు కూడా పై అధికారుల మాటలు వినడు. ఎవరైతే నాకేంటి అనే ధోరణిలో ఆయన శైలి ఉంటుందనేది ఇక్కడి ప్రజల భావన. ఒక అధికార పార్టీ నాయకుల మాటలు తప్ప ఆయన చెవికి ఏది ఎక్కదు అనేది జగమెరిగిన సత్యం అని ఇక్కడ ప్రజల భావన,ఆయన ఓ రక్షణాధికారి కానీ ఆ పదానికే వ్యతిరేకంగా బాధితులను, ఆయన దగ్గరకు వచ్చే వారిని సైతం వేధిస్తున్న వైనం ఇక్కడి ప్రజల్లో వ్యక్తం అవుతుంది. రక్షణాధికారి అంటే ప్రజలకు రక్షణ కల్పించి ప్రజల పాలిట ఏమైనా బాధలు ఉంటే తీర్చాల్సిన అధికారే నేడు రాజకీయ నాయకులకు వాత్తసు పలుకుతూ బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం చూస్తుంటే అసలు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.ఇక ఈయన పంత వేరే. ఆయన చెప్పింది వింటే ఓకే లేదంటే నాట్ ఓకే. అది బాధితులైన లేఖ పై అధికారులైన ఆయన ఎవరి మాట వినడు. సీతయ్య ఎవరి మాట వినడు అనే ధోరణిలో ఆయన అవలంబిస్తున్న విధానాలు ఇక్కడ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీతయ్య ఎవరి మాట వినడు అనే దాంట్లో సీతయ్య నిజాయితీపరుడైన అధికారి కానీ ఈ అధికారి దానికి భిన్నంగా వివరించడమే కాకుండా ప్రజలను ఇబ్బందులు పాలు చేయడమే కాకుండా బాధితులను సైతం ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎవరైతే నాకేంటి అనే ధోరణిలో వ్యవహారిస్తున్నారు.ఏది ఏమైనా రాజ్యాంగంలో ప్రజలకు రక్షణ కల్పించాలని రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాత్రం ఒక రక్షణాధికారి ఇష్టానుసారంగా వ్యవహారిస్తూ ఆయన చెప్పిందే వేదం ఆయన చేసేది ధర్మంగా ఆయన ప్రవర్తన శైలి ఇక్కడ ప్రజలు జన్మించుకోలేకపోతున్నారు. వారు ఎవరైనా సరే అధికార పార్టీ కాకపోతే ఎంతటి వారైనా వారు ఏ రంగంలో ఉన్న ఆయనకు సంబంధం లేదు అవసరమైతే ఇష్టానుసారంగా మాట్లాడుతూ దూషిస్తూ బయటకు వెళ్ళండి అంటూ బెదిరిస్తున్న వైనం అధికారి నైజం. ఇలాంటి అధికారిపై పై స్థాయి అధికారులు ఎన్నిసార్లు ప్రశ్నించిన ఎన్నిసార్లు హెచ్చరించిన ఎందుకు మారడం లేదనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలి పోయింది. కేవలం అధికార పార్టీ నేతల అండదండలు తనకు ఉన్నాయని భావనతోనే ఇలా నడుచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.నాడు ఫ్రెండ్లీ పోలీస్ నేడు ఏం పోలీస్ అనేది అర్థం కాని విధంగా రాజకీయాల్లో రాటు తేలిన నేతలకు రాజకీయాలకు వత్తాసు పలుకుతూ రాజకీయ రంగానికి సలాం కొడుతూ చేస్తున్న వైనాన్ని చూస్తే అసలు రక్షణ వ్యవస్థ ఎటువైపు వెళ్తుందో ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందో అనేది అర్థం కాని ప్రశ్నగా మారిందని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒకానొక పోలీస్ ఠానాలో జరుగుతున్న ఈ తంతుపై అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ పెద్దపల్లి జిల్లా స్థాయి అధికారి మందలించినప్పటికీ ఎందుకు మారడం లేదు ఎవరి అండ చూసుకొని మారడం లేదు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది అనేది ఇక్కడ ప్రజల భావన, ఇప్పటికైనా సదురు అధికారి తీరు మారకపోతే పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రజలు వేచి చూస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :