ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో గడ్డం రవీందర్ గుప్త నిలిచారు.సంబంధిత రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అధికారికంగా సమర్పించారు. నామినేషన్ అనంతరం గడ్డం రవీందర్ గుప్త మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిత్యం స్వరం వినిపిస్తూ, నిజాయితీతో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతోనే ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు. రామగుండం అభివృద్ధిని వేగవంతం చేయడం, పారదర్శక పాలనను అమలు చేయడం, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే పరిపాలనను అందించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణంలో మౌలిక వసతుల మెరుగుదల, శుభ్రత, తాగునీరు, రహదారులు, విద్యుత్, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.నామినేషన్ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో గడ్డం రవీందర్ గుప్త నామినేషన్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాసేవ నేపథ్యం, స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న అభ్యర్థిగా ఆయన పోటీ ఎన్నికల సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Admin
Aakanksha News