Wednesday, 13 May 2026 05:34:43 PM

అవసరానికనుగుణంగా మారుతున్న మనుషులు....

— నేటి సమాజపు నిజస్వరూపం...

Date : 28 November 2025 10:09 PM Views : 301

ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : మనిషి స్వభావం, మనస్తత్వం, సంబంధాలు — ఇవన్నీ కాలంతో, పరిస్థితులతో మారుతుంటాయి. “ఈ సమాజంలో నమ్మేంత మంచి వాళ్లు లేరు… నమ్మలేనంత చెడ్డ వాళ్లు లేరు… అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్ష్యం” అనే వ్యాఖ్య నేటి జీవన విధానానికి అద్దం పడుతోంది. సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు, వ్యక్తిగత ప్రయోజనాలు, పోటీ వాతావరణం ఇవన్నీ కలిసి మనుషుల ప్రవర్తనపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి.అనేక సంఘటనలు చూస్తుంటే సంబంధాలు కూడా ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నాయి. నమ్మకం, స్నేహం, కుటుంబ బంధాలు కూడా పరిస్థితుల ఆధారంగా మారిపోతున్నాయన్న భావన ప్రజల్లో పెరుగుతూనే ఉంది. అవసరానికి తోడు నిలిచే వారు అవసరం పూర్తయ్యాక సంబంధాలను దూరంగా ఉంచే పరిస్థితి తరచూ కనిపిస్తోంది. ఇదే కారణంగా ‘మంచివాళ్లు లేరు’ అన్న విరక్తి ఒకవైపు పెరుగుతుంటే, ‘చెడ్డవాళ్లు కూడా అంతగా లేరు’ అన్న నిజాన్ని మరోవైపు అంగీకరించాల్సి వస్తోంది.సైకాలజీ నిపుణుల ప్రకారం, ప్రతి వ్యక్తి తన పరిస్థితులు, అవసరాలు, ఒత్తిళ్లు, లక్ష్యాల ప్రకారం ప్రవర్తనను మార్చుకోవడం సహజమే. కానీ అది సంబంధాలు, విలువలు, నైతికతలను ప్రభావితం చేసే స్థాయికి వెళ్లడం ఆందోళన కలిగించే విషయం. నేటి యువత కూడా ఇదే భావనను ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలు, విద్యా రంగం, రాజకీయాలు, ఉద్యోగ వ్యవస్థ — ప్రతిచోటా మారుతున్న వ్యక్తిగత మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తోంది.సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, సమాజం మొత్తం చెడ్డదికాదు, మానవత్వం కూడా అంతరించ లేదని చెబుతున్నారు. కానీ నమ్మకం దెబ్బతినే ఘటనలు ఎక్కువవుతుండడం వల్ల ప్రజలలో అపనమ్మకం పెరుగుతున్నదని వారు అభిప్రాయపడ్డారు. అవసరాలు, అవకాశాలు, ప్రయోజనాలు వ్యక్తుల మధ్య దూరాలు సృష్టిస్తున్నాయని, అయినప్పటికీ మంచి సంబంధాలు, సత్సంగం, సానుభూతి విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మొత్తానికి— కాలం మారినా, పరిస్థితులు మారినా, మన సంబంధాలు, నిజాయితీ, మానవత్వం మాత్రం మారకూడదన్న సందేశమే ఈ ఆలోచన మనందరికీ గుర్తు చేస్తోంది. కొంతమంది ఏదో ఏదో రకాలుగా ప్రజాస్వామ్యంలో పారే హీరోలుగా చలామణి అవుతూ మేము చెప్పిందే వేదం మేము చేసే ధర్మం ఆడ రోడ్లు కూల్చివేస్తున్నారు. ఇంకొక దగ్గర కూల్చివేయాలి అని చెప్పుతూ ఉన్న కొన్ని వాట్సాప్ మీడియాలో చూస్తే పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వాట్సాప్ మీడియాలో అంటే సమాజానికి మేలు చేయాలి సొంత ప్రయోజనాల కాదు కానీ సొంత ప్రజల కోసమే పాకులాడుతూ కొన్ని రోజులు దూరంగా ఉన్నట్టు నటిస్తూ మరికొన్ని రోజులు దగ్గరగా ఉన్నట్టు భావిస్తూ పబ్బం గాడుపుతున్న ఇలాంటి సోషల్ మీడియా వ్యక్తులను చూస్తే సమాజం సిగ్గుపడాలని ప్రజలు భావిస్తున్నారు. సమాజంలో ప్రత్యేక వృత్తిలో ఉండి సొంత అవసరానికి తగ్గట్టుగా ఎవరు అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలుకుతూ బయటికి కనిపించని సెటిల్మెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో నిరంతరం ఏదో సమస్యల మీద పోరాటం చేస్తున్నట్లు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కొంతమంది వీణ వేషాలు వేస్తున్న బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో బహిరంగ కామెంట్లు చేసిన విధానం మర్చిపోకముందే మళ్లీ జోకులు మొదలుపెట్టిన విధానం చూస్తే ఇట్టే అర్థమవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి నకిలీ దొంగ సోషల్ మీడియా వ్యక్తుల సమాచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :