Saturday, 08 August 2026 06:09:15 AM

కాంగ్రెస్ పార్టీ నుంచి దాసరి విజయ్‌ కుమార్ సస్పెన్షన్...

Date : 13 January 2026 03:17 PM Views : 697

ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎన్ఎస్ యూఐ సభ్యుడు దాసరి విజయ్‌ కుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నెల 11వ తేదీన గోదావరిఖనిలో నిర్వహించిన ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అనంతరం సభా వేదికపై దాసరి విజయ్‌కుమార్ దురుసుగా ప్రవర్తించారని, ఇతర పార్టీ నాయకులను దుర్భాషలాడారని పార్టీ అధిష్టానం గుర్తించింది. ఈ చర్యలు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఉన్నాయని భావించిన కమిటీ, ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సస్పెన్షన్ పత్రంలో స్పష్టం చేసింది.ఈ సస్పెన్షన్ 2026 జనవరి 13వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని అధ్యక్షుడు బొంతల రాజేష్ తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఇలాంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :