Sunday, 27 September 2026 10:04:04 PM

కూల్చివేతలలో ముందుండే ఆ మహిళ అధికారి వివరాలే మిస్టరీ..!

అభివృద్ధి పనులా? అస్తవ్యస్త కూల్చివేతలా? ప్రజల్లో పెరుగుతున్న సందేహాలు.. వివరణలేమీ లేకుండా కూల్చివేతలేనా? మీడియా ముందుకు రాని సదరు అధికారి

Date : 20 December 2025 10:24 PM Views : 1257

ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : రామగుండం నియోజకవర్గం మొత్తం ప్రస్తుతం కూల్చివేతలతోనే ప్రతిధ్వనిస్తోంది. ఎక్కడ చూసినా అభివృద్ధి పేరుతో నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతుండటం, అయితే కూల్చివేసిన చోట్ల ఒక్క పనీ పూర్తికాకపోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. అభివృద్ధి అంటే ఏమిటి..? దాని లక్ష్యం ఏంటి..? ఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి..? అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లభించకపోవడం నియోజకవర్గ ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తోంది.ఇప్పటి వరకు రామగుండంలో కూల్చివేసిన ప్రాంతాలను పరిశీలిస్తే, పనులు ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. రహదారుల విస్తరణ, డ్రైనేజీ, వాణిజ్య సముదాయాలు, ఇతర అభివృద్ధి పనుల పేరుతో భవనాలు కూల్చివేసినా, వాటి స్థానంలో పూర్తి స్థాయి పనులు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో కూల్చడమే అభివృద్ధా..? అన్న ప్రశ్న ప్రజల్లో నిత్యం వినిపిస్తోంది.అలాగే ప్రతి కూల్చివేతలో ముందుగా కనిపించే ఓ మహిళ అధికారి ఎందుకు బహిరంగంగా కూల్చివేతల వివరాలు ఎందుకు వెల్లడించడం లేదు.. అసలు ఆ మహిళ అధికారి ఎవరు..?దీనికి సంబంధించి పూర్తి వార్త కథనం మీ ఆకాంక్ష న్యూస్ లో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :