Wednesday, 04 February 2026 05:40:20 AM

నేటితో తెర పడనున్న రేషన్ షాపు వివాదం....

" తొలి ఆకాంక్ష" కథానానికి స్పందన...

Date : 30 January 2026 01:50 PM Views : 114

ఆకాంక్ష న్యూస్ - చిన్న ప్రత్యేక ప్రతినిధి / : రామగుండం కార్పొరేషన్ పరిధిలో గత కొంతకాలంగా జరుగుతున్న రేషన్ షాప్ వివాదంపై తొలి ఆకాంక్ష దినపత్రికలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు.. దీనిపై పూర్తి విచారణ చేపట్టిన అనంతరం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు తెలిపినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారులు నేడు పూర్తిస్థాయి చర్య తీసుకుని ఈ వివాదానికి ముగింపు పలికే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ షాపు వివాదం రామగుండం నియోజక వర్గంలో చర్చనీ అంశంగా మారింది. అయితే డీలర్ కిషన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై అధికారులు సమగ్ర విచారణ జరిపినట్లు తెలుస్తుంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 18 ఐ సి ఓ పరిధిలోని ఎఫ్ సి షాపులకు సంబంధించి పెద్దగా విమర్శలు లేకపోయినా కేవలం ఒకే ఒక షాపుపై వరుసగా వస్తున్న ఆరోపణ నేపథ్యంలో ఈ వివాదానికి ముగింపు పలికినట్లు తెలుస్తుంది. దీనిపై సాయంత్రం ఎటువంటి ప్రకటన వెలుబడుతుందో వేచి చూడాల్సిందే..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :