ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి సోమవారం గ్రామ సర్పంచ్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మండల ప్రజలు వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందరి సౌకర్యార్థం ఈ పబ్లిక్ టాయిలెట్స్‌ను నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు పరిశుభ్రతను పాటిస్తూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంకినేని రవీందర్ రావు, ఉప సర్పంచ్ శ్రీను, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News