Thursday, 25 June 2026 08:20:18 PM

సంత్ సేవాలాల్ 286వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి...

Date : 17 February 2025 02:03 PM Views : 408

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / ఖమ్మం జిల్లా : సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు.. లంబాడీ అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే లంబాడీ అని లంబాడీలు గత ఎన్నికల్లో నాకు భారీ మెజారిటీ రావడంలో కీలక పాత్ర పోషించారన్నారు. అంతే కాకుండా లంబాడీలను ఎస్టీలో చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దని సేవాలాల్ ను బంజారాల ఆరాధ్య దైవంగా పిలుస్తారన్నారు. అతని హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారని సేవాలాల్ మహరాజ్ జయంతి పురస్కరించుకుని ఫిబ్రవరి 15న సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 2024లో ప్రకటించింది.సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుషుడు అయ్యారన్నారు.సేవాలాల్‌ మహరాజ్‌ ఆనాడు బంజారా జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారనీ తెలిపారు.బ్రిటిష్‌ పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయ్యిందన్నారు. ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మార్గంలో నడిపించేంందుకు సేవాలాల్‌ మహారాజ్‌ అవతరించారనీ సేవాలాల్ మహారాజ్ ఆదివాసీ హక్కుల పరిరక్షణ, సమాజ మార్గదర్శకత్వంలో కీలక పాత్ర పోషించారని ఆయన చూపిన మార్గం ఆదివాసీ ఉద్యమాలకు, సామాజిక సమానత్వ పోరాటాలకు ప్రేరణగా నిలుస్తోందన్నారు.గోండు తెగకు చెందిన మహానుభావుడిగా, సమాజ సేవకుడిగా, ఆదివాసీ హక్కుల పరిరక్షకుడిగా గుర్తింపు పొందారనీ గోండు తెగ ప్రజలను ఆర్థికంగా,సాంస్కృతికంగా,రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు ఉద్యమించరని అప్పటి ఆధిపత్య వ్యవస్థలపై పోరాడి, ఆదివాసీలను వారి హక్కుల గురించి చైతన్యం కలిగించారు.ఆయన ఆదివాసీ తెగల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ... నూతన మార్గదర్శనం ఇచ్చారు.మహారాజ్ ను ఆధ్యాత్మిక గురువుగా, ధర్మ పరిరక్షకుడిగా భావిస్తారు.తెలంగాణ ప్రభుత్వం సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ... ఆదివాసీ ప్రజలకు గౌరవం ఇస్తోంది.ఆదివాసీ గౌరవాన్ని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరి దయాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్,మంగీలాల్, ఖమ్మం జిల్లా నాయకులు భూక్యా సురేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు రవి నాయక్, బంజారా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :