Friday, 25 September 2026 05:46:26 PM

రాజకీయాల్లో న్యాయవాదులు ప్రజలకు అంకితభావంతో సేవలందించాలి..

పదవులకు వన్నె తెచ్చే విధంగా వ్యవహరించాలి.. వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం..

Date : 18 December 2025 03:33 PM Views : 359

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల జిల్లా : గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొందిన న్యాయవాదులు ఆయా గ్రామ ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తూ, మంచి పేరు సంపాదించుకోవాలని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం అన్నారు. వేములవాడ కోర్టు బార్ అసోసియేషన్ లో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తూ దుండ్రపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన జంగం అంజయ్యను, వివిధ గ్రామాల వార్డు సభ్యులుగా గెలుపొందిన మారుమొఖం అనిల్ కుమార్ (మల్లారం), ఖన్నం అనిల్ (అనంతపల్లి), తోట శేఖర్ (నాగయపల్లి)లను గురువారం బార్ అసోసియేషన్ హాల్లో అధ్యక్షులు సదానందం ఆధ్వర్యంలో న్యాయవాదులు శాలువాలతో సన్మానించి మెమెంటోలను అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందిన న్యాయవాదులు ప్రజలకు సేవలందిస్తూ,రాజకీయ విలువలను పెంచాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ కోర్టు ఏజీపీ బొడ్డు ప్రశాంత్ కుమార్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, కటకం జనార్ధన్, పొత్తూరు అనిల్ కుమార్, విద్యాసాగర్ రావు, కోళ్ల శ్రీనివాస్, పర్లపల్లి అంజయ్య, పెంటరాజు, జక్కుల పద్మ తదితరులున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :