ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మంథని : మంథని మండలం సిరిపురం గ్రామంలో సిరిపురం PHC గద్దలపల్లి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఎండకాలంలో వడ దెబ్బ వడగాలుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు సూచనలను చేశారు. ఏదైనా అత్యవసరంగా ప్రయాణించాల్సి వస్తే ఉదయం లేఖ సాయంత్రం బయటకు వెళ్లే ముందు తలకు రుమాలు గోడుగు ఉపయోగించుకోవాలని నీళ్లు వెంట ఉంచుకోవాలని సూచించారు. వేసవిలో ఓఆర్ఎస్ గాని నిమ్మరసం ఉప్పు చక్కెర కలిపిన నీటిని తాగాలని వడ దెబ్బ తగిలిన వారు సొమ్మసిల్లీ పోవడం తలనొప్పి జ్వరం వేగంగా గుండె కొట్టుకోవడం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జి ,శ్రీజ MLhp,ch వీరమ్మ Anm మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు
Admin
Aakanksha News