Wednesday, 04 February 2026 05:40:25 AM

ఔను... వాళ్ళిద్దరూ కలిసిపోయారు.. ఆ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు...

అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురవుతున్న నాయకులు కార్యకర్తలు...

Date : 03 February 2026 01:05 PM Views : 556

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : ఔను... వాళ్ళిద్దరూ కలిసిపోయారు.. ఇప్పుడు ఎక్కడ చూసినా జోరుగా ఇదే చర్చ కొనసాగుతుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు అనేది దేనికే నిదర్శనంగా చెప్పవచ్చు.. ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆ నియోజకవర్గ రాజకీయపరంగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఒకానొక దశలో రాష్ట్ర రాజకీయాలు సైతం ఆ నియోజకవర్గ వైపే చూస్తాయని, రాష్ట్ర రాజకీయాలకు కూడా ఆ నియోజకవర్గ కేంద్ర బిందువుగా మారుతుందనేది పలువురి రాజకీయ విశ్లేషకుల భావన. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గమంతా జోరుగా ఒక చర్చ సాగుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఒకరు మాజీ ఎమ్మెల్యే అయితే మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పూర్తిగా సహాయ సహకారాలను అందిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే పురపాలక ఎన్నికల గెలుపులో కీలకంగా మాజీ ఎమ్మెల్యే మారినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు పార్టీ అధినేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియోజకవర్గాలలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేస్తే ఆ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా సాగుతున్నట్లు తెలుస్తుంది. ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేకు పూర్తిస్థాయిలో సహకరించి కొంతమంది సొంత పార్టీ నేతలను సైతం వారి పార్టీలో చేర్పిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి సదరు మాజీ ఎమ్మెల్యే తమదైన శైలిలో తమ సహకారాలను అందించడమే కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం ఆయా డివిజన్ లలో సదరు మాజీ ఎమ్మెల్యే డమ్మీ అభ్యర్థులను నిలబెట్టినట్లు జోరుగా రాజకీయాల్లో ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉంటే మరికొన్ని డివిజన్ లలో ఆ పార్టీకి కరువయ్యారా అనే పరిస్థితి నెలకొంటుంది. కొన్ని డివిజన్ లలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోవడం సర్వేల పేరుతో గెలుపు గుర్రాలకే బీఫాంలోను అందజేస్తామని కాలయాపన చేయడం మొదటి నుండి పార్టీలో ఉన్న నాయకులను పట్టించుకోకుండా ఉండడం, సిట్టింగ్ ఎమ్మెల్యేకు అనుకూలంగా వారి చూపు పక్క పార్టీ వైపు వెళ్లే విధంగా చేయడంలో మాజీ ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో సఫలీకృతమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరిని అయోమయానికి గురిచేస్తుంది. ఇంతకీ సెట్టింగ్ ఎమ్మెల్యేకు ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేకు జరిగిన ఒప్పందం ఏమిటి..? సెట్టింగ్ ఎమ్మెల్యేకు పూర్తిస్థాయిలో మాజీ ఎమ్మెల్యే సహకరించడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నాయి..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :