Sunday, 13 September 2026 01:12:41 AM

ప్రతి ఒకరు సిరి సంపదలు సుఖ సంతోషాలతో జీవించాలి...డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఘనంగా ఆటపాటలతో లింగమంతుల స్వామికి బోనాల సమర్పణ...

Date : 16 February 2025 06:19 PM Views : 536

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / ఖమ్మం జిల్లా : ప్రతి ఒక్కరు సిరిసంపదలు సుఖసంతోషాలతో జీవించాలని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పండితాపురం, బండిపాడు రాయి గూడెం గ్రామాలకు చెందిన యాదవులు ఘనంగా ఆట పాటలతో గ్రామ శివారులోని సీత బంధం వాగు దగ్గర ఉన్న లింగమంతుల స్వామి గుడి దగ్గరకు ఊరేగింపుగా వెళ్లి బోనాలను చెల్లించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ బోనాల పండుగలో ప్రతి ఒక్కరు సమిష్టిగా పాల్గొని విజయవంతం చేయడం పట్ల డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ గ్రామస్తులను అభినందించారు. ప్రతి సంవత్సరం దురాజ్ పల్లిలో జరిగే పెద్దగట్టు లింగ మంతుల జాతర ప్రారంభమయ్యే రోజున ప్రతి ఏటా గంగమ్మని, లింగమంతుల స్వామికి మొక్కులు చెల్లించడం గ్రామంలో అనాదిగా, ఆనవాయితీగా వస్తుందని, ఈ సాంప్రదాయం తరతరాల నుండి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చిలకల వెంకట నరసయ్య, చిత్తారు సింహాద్రి యాదవ్, మేకల మల్లికార్జునరావు, చేతుల నాగేశ్వరరావు, బండారు ప్రభాకర్, మొరిమేకల కోటయ్య తుప్పాతి రవికుమార్ , గ్రామ పెద్దలు బానోతు నరసింహ నాయక్, శీలం పుల్లయ్య మేకపోతుల మహేష్, బండి లక్ష్మీనర్సు, భూక్య నాగేంద్రబాబు, బండిపాడు మేకల మల్లికార్జునరావు, కానబోయిన వెంకటనారాయణ అల్లిక బక్కయ్య, చింతల పెద్ద వెంకయ్య, కేతబోయిన రాంబాబు, అరి పిన్ని వెంకటేశ్వర్లు, సోమనబోయిన నాగేశ్వరరావు,చింతల చిన్న వెంకటేశ్వర్లు చింతల వెంకమ్మ, ఎర్రగడ్డ చంద్రయ్య ఎర్రగడ్డ గురవయ్య, కంప సాటి ఉపేందర్ అల్లిక ఉపేందర్ సత్తి చిట్టిబాబు, చిన్నబోయిన సత్యం చిన్నబోయిన వీరబాబు,, సత్తి సైదులు బరిగల లింగయ్య, చిన్నబోయిన కృష్ణ చిన్న బోయిన నాగేశ్వరరావు మేకల కృష్ణ కేతబోయిన లాలయ్య, కానబోయిన బిక్షం మరియు మహిళలు, యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :