Thursday, 25 June 2026 08:24:08 PM

చలో హైదరాబాద్ నిరసనకు బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నాయకులు...

సీజే గవాయిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకత్వం..

Date : 01 November 2025 12:36 PM Views : 286

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మేదక్ జిల్లా : పాపన్నపేట, నవంబర్ 1 (ఆకాంక్ష): సుప్రీంకోర్టు జడ్జి సీజే గవాయ్ పై జరిగిన దాడి ఘటనకు నిరసనగా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైంది. ఈ క్రమంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు దండోల్ల సామెల్ మాదిగ ఆధ్వర్యంలో, అనేక మంది ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి చలో హైదరాబాద్ నిరసన కార్యక్రమానికి భారీగా బయలుదేరారు.పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు వెల్లడించారు. సీజే గవాయ్‌పై దాడి అనేది రాజ్యాంగ వ్యవస్థపై దాడి అని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిదని వారు తెలిపారు. దేశ న్యాయవ్యవస్థకు ప్రతీక అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హైదరాబాద్ వైపు పయనం అవుతున్నారు.ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, మహిళా విభాగం నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, విద్యార్థి నాయకులు, వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :