Wednesday, 04 February 2026 05:40:24 AM

అభివృద్ధి హామీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్న బీజేపీ అభ్యర్థి...

• గెలుపు దిశగా బీజేపీ ముందంజలో ఉందని నేతల ధీమా... 52వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి రాజేష్ శర్మ విస్తృత ప్రచారం....

Date : 03 February 2026 02:44 PM Views : 53

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులతో ప్రచారాన్ని ముమ్మరం చేయగా, 52వ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ తరఫున వ్యాపారవేత్త రాజేష్ శర్మ ఎన్నికల బరిలో నిలిచి ప్రజల్లో చురుకుగా కలిసిపోతున్నారు. ఈ క్రమంలో డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించిన ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని కాలనీలు, వీధులు, వ్యాపార ప్రాంతాల్లో పర్యటించిన రాజేష్ శర్మ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వ్యాపారవేత్తగా తనకు ఉన్న అనుభవం డివిజన్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, ప్రజల నమ్మకాన్ని వృథా చేయనని హామీ ఇచ్చారు. పారదర్శక పాలనతో పాటు అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.డివిజన్‌లో మౌలిక వసతుల కొరత, రోడ్ల దుస్థితి, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు వంటి అనేక అంశాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్న రాజేష్ శర్మ, ఎన్నికైన వెంటనే ఈ సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా నాణ్యమైన రహదారుల నిర్మాణం, సక్రమమైన డ్రైనేజీ వ్యవస్థ, నిరంతర తాగునీటి సరఫరా కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ పనిచేస్తానని చెప్పారు.ప్రజలతో ముఖాముఖి సంభాషణల్లో వారి అవసరాలు, అభిప్రాయాలను నోట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న రాజేష్ శర్మ ప్రచారానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. అభివృద్ధి, నిజాయితీ, సేవాభావం అనే అంశాలతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, 52వ డివిజన్‌లో బీజేపీ విజయం దిశగా అడుగులు వేస్తోందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 52వ డివిజన్‌లో సాగుతున్న ఈ ప్రచారం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ప్రజల సమస్యలపై స్పష్టమైన హామీలతో ముందుకు వస్తున్న రాజేష్ శర్మ ప్రచారం ఎన్నికల ఫలితాలపై కీలక ప్రభావం చూపుతుందనే చర్చ స్థానికంగా కొనసాగుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :