Thursday, 05 February 2026 04:24:38 AM

ప్రజాసేవే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థి గుండు రాజు దూసుకుపోతున్న ప్రచారం...

Date : 04 February 2026 03:07 PM Views : 174

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : అభివృద్ధే ధ్యేయంగా, ప్రజాసేవే పరమార్థంగా, ముఖ్యంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే స్పష్టమైన లక్ష్యంతో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజు ఎన్నికల ప్రచా వేగం పెంచారు. కుర్చీ గన్న రాజు, గెలుపే టా తిరుగుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.రాజకీయాలు అంటే వాగ్దానాలు కావని కేవలం చేసి చూపించడమే అసలైన నిజం అని నమ్మే వ్యక్తిగా గుండు రాజు ప్రజల్లో విశ్వాసం కలిగిస్తున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తూ స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన అజెండాగా ప్రజలకు వివరిస్తున్నారు.చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కలుపుగోలుగా మెలుగుతూ ప్రజల్లో మమేకమవుతూ సాగుతున్న ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నేను గెలిస్తే ఒక్కడే కార్పొరేటర్ కాదు… ఈ వార్డు ప్రజలందరూ కార్పొరేటర్లే” అన్న భావనతో తాను ప్రజలకు కుటుంబ సభ్యుడిలా ఉంటానని గుండు రాజు హామీ ఇస్తున్నారు. రాజు ప్రజాసేవా తపనకు స్పందించిన 57వ డివిజన్ ప్రజలు కూడా ఆయనకు అండగా నిలుస్తామని, కచ్చితంగా గెలిపిస్తామని భరోసా ఇస్తున్నారు. ప్రచారంలో అడుగడుగునా ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, దీవెనలు గుండు రాజుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ, 57వ డివిజన్‌లో ప్రజల మద్దతుతో గెలుపు దిశగా దూసుకెళ్తున్న గుండు రాజు ప్రచారం, ప్రజాసేవే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :