Thursday, 25 June 2026 08:23:42 PM

నల్లగొండ జిల్లా సింగారం గ్రామంలో కుటుంబ పోరులో మానవతా విలయం....

ఇల్లును గిఫ్ట్ చేసిన తండ్రి – ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న ఆర్డీఓ ఆదేశాలతో కొడుకు ఆవేదన...

Date : 12 July 2025 06:37 AM Views : 476

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నల్లగొండ జిల్లా : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన భూమిపై వివాదం మానవతా కోణాన్ని తాకింది. కోడి చంద్రయ్య అనే వృద్ధుడు తన ఇంటిని కూతురు అలివేలుకు గిఫ్ట్ డీడ్ చేశాడు. తన కొడుకు రాములు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో ఆర్డీఓ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇంటిని ఖాళీ చేయాలన్న ఉత్తర్వుతో రాములు కుటుంబంతో కలిసి మానసికంగా తల్లడిల్లిపోయాడు.28 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నాం. ఇప్పుడు పిల్లలతో పాటు బయటకు వెళ్లిపోవాలంటున్నారు. చిన్నపిల్లలు ఉన్నారని చెప్పినా, పోలీస్ స్టేషన్‌కు పదే పదే పిలిపించి ఒత్తిడి చేస్తున్నారు" అని రాములు కన్నీటితో వేదన వ్యక్తం చేశాడు.ఈ పరిణామాల నేపథ్యంలో రాములు కుటుంబం శుక్రవారం గ్రామ పంచాయతీ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించింది. "ఇల్లు తండ్రి పేరిటే ఉంది. మానవతా దృష్టితో దీనిపై విచారించి న్యాయం చేయాలి" అని బాధిత కుటుంబం కోరుతోంది.ఇప్పటికే నల్లగొండ సివిల్ కోర్టును ఆశ్రయించిన రాములు, జిల్లా కలెక్టర్‌కి కూడా విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాన్ని రోడ్డున పడేసే విధంగా నిర్ణయం కాకుండా, వాస్తవాలు, మానవతా కోణం పరిశీలించి నిర్ణయం ఇవ్వాలని ఆయన అధికారులను వేడుకుంటున్నాడు.ఈ సంఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :