Tuesday, 11 August 2026 02:06:58 PM

పెళ్లికి ముందురోజు వేరే అమ్మాయితో పెళ్ళికొడుకు జంప్...

Date : 17 May 2025 12:08 AM Views : 711

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / కరీంనగర్ జిల్లా : ఒకరినొకరు చూసుకున్నారు. పెళ్లి చూపుల్లో వారి మధ్య ఇష్టం కుదరడంతో ఇద్దరి అంగీకారంతో పెద్దలు పెళ్లికి నిశ్చయించారు. దీంతో ఇరువైపుల పెద్దలు పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. వధువు పెళ్లికూతురుగా ముస్తాబయింది. బంధువుల రాకపోకలు ఇంటి నిండా హడావిడితో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో పెళ్ళికొడుకు చేసిన వ్యవహారం ఒక్కసారిగా అందరిని షాక్ కు గురి గురిచేసింది.వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్‌లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మధుకర్ రెడ్డికి హుజురాబాద్ మండలం కాట్రపల్లికి చెందిన ఓ అమ్మాయితో నిచ్చితార్థం జరిగింది. మే 17న వీరి పెళ్లి జరగాల్సి ఉండగా.. అమ్మాయి తరఫు వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.అందరూ పెళ్లి హడావిడిలో మునిగి ఉన్నారు. వధువు ముస్తాబైంది. వరుడు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎంతసేపైనా వరుడే కాదు వరుడి తరుపు బంధువులు కూడా రావడం లేదు. ఇంతలోనే గుండె పగిలే వార్త. వరుడు వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అందుతో ఒక్కసారి పెళ్లి పందిరి మూగపోయింది. అందరు షాక్ గురైయ్యారు. కానీ, ఇంతలోనే పెళ్లికి ఒక రోజు ముందు మధుకర్‌ రెడ్డి మరో అమ్మాయిని ఎవరికీ తెలియకుండా పెళ్ళి చేసుకొన్నాడు. రూ.40 లక్షల విలువైన అర ఎకరం భూమి,10 తులాల బంగారం, 6 లక్షల నగదుతో పెళ్లికి ఒప్పుకున్న వరుడు ఇలా పెళ్లి రోజు ఊహించని షాక్‌ ఇవ్వడంతో వధువు తల్లిదండ్రుల గుండె పగిలినంద పనైంది. దీంతో అమ్మాయి తల్లి దండ్రులలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరుడి కోసం గాలిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పెళ్లి కూతురు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :