Monday, 10 August 2026 05:35:52 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కరపత్రం విడుదల..

Date : 06 March 2025 06:42 AM Views : 434

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నిర్మల్ జిల్లా : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఖానాపూర్ మండలంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకులు భాను బేగం అదిలాబాద్ జిల్లా నాయకురాలు రమ్య కళ ఆధ్వర్యంలో 115 వ కరపత్రం ను ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ . సుదాకార్ ,కార్యదర్శి కర్నాటి మల్లేష్ లు ముఖ్య అతిధులుగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సుదాకార్ మాట్లాడుతూ శ్రామిక మహిళల పోరాటానికి చిహ్నం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ మన్నారు.వందల ఏళ్ల కిందటే పని గంటలను తగ్గించాలని తాము అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులను తామే మార్చుకోవడం కోసం మహిళలు వీధుల్లోకి వచ్చి కదం తొక్కిన రోజుకు గుర్తుగా మహిళా దినత్సోవం రూపొందించిందన్నారు. ఆ పోరాటాల స్పూర్తిని మరోసారి గుర్తు చేసుకుంటూ దేదీప్యమానమైన భవిష్యత్తు కోసం మహిళా సమాజం అడుగులు వేయడం కోసం సూర్తినికి పొందే రోజుగా దీన్ని నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అయితే నేడు దురదృష్టవశాత్తు మహిళా దినోత్సవం అందించిన స్పూర్తి క్రమంగా కనుమరుగవుతున్నది. ఏ లక్ష్యం కోసం పోరు జరిగిందో, దేని కోసం పోరాటం జరగాలో అనే అంశాల కనీస ప్రస్తావన లేకుండా మహిళా దినోత్సవాల నిర్వహణ ఒక తంతుగా మారుతున్న పరిస్థితులు మార్చేసి మహిళలకు అందవలసిన స్పూర్తిని, వారికి చూపించాల్సిన నవయుగాన్ని కనుమరుగు చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సోషలిస్టు సమాజం వ్యవస్థాపకుడు కామ్రేడ్‌ లెనిన్‌ మహశయుడు మహిళల సాధికారత గురించి చేసిన వ్యాఖ్యలను ఒక సారి గుర్తు చేసుకోవలసి ఉన్నది. మహిళా సమాజంలో నూతన వెలుగులు నిండాంటే స్త్రీలను వంటిల్లు అనే జీవరహిత వాతావరణం నుంచి బయటకు తెచ్చి సామాజిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం, రాజకీయాల్లోకి తీసుకుని రావడం చాలా ముఖ్యమన్న ఆలోచనలు విప్లవాత్మకమైనవి. ‘‘వంట గదికి పరిమితంగా చూడబడుతున్న మహిళలను అక్కడి నుంచి విముక్తం చేయకపోతే వారికి నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు, సమానత్వాలు సాద్యం కావనేది లెనిన్‌ ప్రతిపాదన. ప్రతి వంటకత్తె ఒక రాజకీయ వేత్త కావాలి అనే లోతైన అంశాలతో లెనిన్‌ అనేక ప్రసంగాలు, వ్యాసాలు కూడా రాశారు. ఇక్కడ మహిళలు రాజకీయ వేత్త కావాలి అంటే కేవలం పదవులు పొందడం కాదు, పదవుల కోసం ఉద్యమాలు నిర్వహించడమూ కాదు. ‘సరైన రాజకీయ, ఆర్థిక, తాత్విక తుర్పుధాలును అలువల్చు కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఖానాపూర్ మండల అధ్యక్షులు పసుపుల మీన అమ్ముల కవిత ,ఎర్రన్న శిరీష ,పసుపుల మీనా,అరుణ ,అందుర్తి నర్సు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :