Tuesday, 11 August 2026 02:19:21 PM

ప్రభుత్వ భూముల కబ్జాపై గ్రామస్తుల ధర్నా...

Date : 02 April 2025 06:19 PM Views : 449

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మంథని : మంథని మండలంలోని రెడ్డి చెరువు సమీపంలోని ప్రభుత్వ భూములను కొందరు కబ్జాదారుల నుంచి విడుదల చేసి దళితులకు కేటాయించాలని కోరుతూ బుధవారం కాకర్లపల్లి గ్రామస్తులు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. కాకర్లపల్లి గ్రామ దళితులు ప్రభుత్వ భూముల్లో కొమ్మ కొట్టుకొని భూములను చదును చేసుకున్నారన్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం దళితులకు భూ సీలింగ్ యాక్ట్ ప్రకారం భూములను చూపిందని నేటి వరకు పట్టాలు ఇవ్వలేదన్నారు. పట్టాలు ఇవ్వాలని దళితులు అనేక సార్లు పాలకులు, అధికారులకు విన్నవించుకున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం భూములు లేని నిరుపేద దళితులకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, కన్నెబోయిన కొమురయ్య, కాంగ్రెస్ నాయకులు మెండె రాజయ్య, కన్నెబోయిన ఓదెలు, మంథని రామచందర్, బూడిద రమేష్,మంథని సమ్మయ్య, బోసెల్లి శంకర్,సది, రాజేందర్, శేఖర్,లక్ష్మి, స్వరూప మహిళలు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :