Tuesday, 11 August 2026 05:45:48 PM

30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఫారెస్ట్ అధికారులు...

Date : 18 February 2025 04:21 PM Views : 520

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఇల్లెందు మండలం కొమరారం అటవీ శాఖ రేంజ్ అధికారి ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ హిరాలాల్ రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రహదారి నిమిత్తం అటవీ భూమి నుంచి మట్టిని తీసుకపోవడానికి గుత్తేదారు నుంచి రు.30 వేలు డిమాండ్ చేశారు. ఇంతకు ముందే రూ.20వేలు లంచంగా ఇచ్చినట్లు సమాచారం. మళ్లీ గ్రావెల్ తీస్తుండగా అటు విశాఖ సిబ్బందిని పంపించి జేసీబీని, ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. జేసీబీ, ట్రాక్టర్ ను విడిచి పెట్టేందుకు రూ.15000 లంచం తీసుకున్నట్లుగా సమాచారం. అయినప్పటికీ మళ్లీ గ్రావెల్ తోలుకునేందుకు రూ.50 వేలు డిమాండ్ చేయగా రూ.30,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో గుత్తేదారు ఏసీబీని ఆశ్రయించడంతో మంగళవారం ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :