ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నిర్మల్ జిల్లా : నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు బి అరుణ ఆధ్వర్యంలో115వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కరపత్రాన్ని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఎస్.సుధాకర్ ముఖ్యఅతిథిగావిచ్చేసి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మార్చి 8 వ తారీకు నా అంతర్జాతీయ శ్రామిక మహిళ దినోత్సవం ప్రపంచ శ్రామిక మహిళ ఉద్యమముగా చరిత్రలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఆకాశంలో సగము భూమిపై సగము భాగమైనటువంటి మహిళలు అన్ని రంగాలలో ఆర్థిక అసమానతలు దోపిడీ అణిచివేత లను నేటికీ ఎదుర్కొంటా ఉన్నారు . ఈ దేశంలో ఒకవైపు దేశంలో మహిళల పట్ల కట్టుబొట్టు ఆచారాలు పని పాట చదువులు ఉద్యోగాలు విషయాలలో చులకన చేయబడతా ఉన్నారు. సామ్రాజ్యవాద విష సాంస్కృతిలో భాగంగా మార్కెట్లో సరుకు లాగా చూసే ప్రపంచ సుందరీమణుల అందాల పోటీలు హైదరాబాదులో నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఒకవైపు మహిళలను ప్రేమ పేరుతో వంచిస్తూ కులము పేరుతో వంచిస్తూ దాడులు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు ఒకవైపు మహిళల ఆర్థిక సోలంబన దిశగా ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయి అని చెప్పుకుంటూ స్త్రీ స్వేచ్ఛ లేకుండా పురుషాధిక్యతలో కొనసాగుతా ఉన్నారు స్త్రీ పురుష సమానత్వము సమాన వేతనము కొరకు పోరాడుతూ స్త్రీలపై బానిసత్వాన్ని రుద్దే బ్రాహ్మణీయ మనువాద పితృస్వామ్యంపై సంఘటితంగా ఉద్యమించాల్సినటువంటి అవసరమో ఉన్నది. ఇందులో భాగంగానే భారత దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షాల ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో సంవత్సర కాలంగా 200 మందికి పైగా సామాన్య ఆదివాసి మహిళలను పిల్లలను యువకులను సుమారు 300 మందికి పైగా మావోయిస్టు కేంద్ర సైనిక బలగాలు ఎన్కౌంటర్ల పేరుతో హత మార్చారు గిరిజనుల పాదాల కింద ఉన్నటువంటి అటవీ భూములలో అపారమైనటువంటి ఖనిజ సంపదలు బడా కార్పొరేట్ శక్తుల దోపిడీకి గురికాకుండా ప్రాణాలను ప్రాణముగా పెట్టి కాపాడుకుంటున్నా ఆదివాసి గిరిజనులను మావోయిస్టులుగా ముద్ర వేసి అడవి నుంచి వారిని గెంటివేయడానికి ఒక అంతిమ యుద్దముగా ప్రకటించింది ఇవాళ 400 క్యాంపులు లక్ష సైనిక బలగాలు రాకెట్లు లాంచర్ల తోటి యుద్ధ విమాన యుద్ధ విమానాలు అధునాతనమైనటువంటి పరికరాలతో మరణముదంగానే మోగిస్తున్నారు దీనిలో భాగంగానే ఆదివాసి మహిళలపై అత్యాచారాలకు పాల్పడి ఆ తర్వాత ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపుతున్నారు. ఈ ఆపరేషన్కు వ్యతిరేకంగా 115వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆపరేషన్ వ్యతిరేకంగా పోరాటం చేయాలని సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగశీల మహిళా సంఘం నిర్మల్.జిల్లా అధ్యక్షురాలు బి అరుణ,నాయకురాలు,జ్యోతి ,లావణ్య ,పద్మ ,రమ్య, గోదావరి, గంగ ,రైతు కూలీ సంఘం నిర్మల్ జిల్లా నాయకులు పెద్దులు తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News