ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మేదక్ జిల్లా : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్పల్లి గ్రామంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతి ఇంటిని ఒకదానికొకటి జాగ్రత్తగా పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులను ప్రశ్నించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన నిధులు లబ్ధిదారులకు విడతల వారీగా బిల్లుల రూపంలో అందుతాయని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమయానికి నిధులు మంజూరు చేసి ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూడాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ పర్యటనలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల ఎంపీడీవో, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు భరత్ గౌడ్‌తో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కలెక్టర్‌ను కలసి తమ సమస్యలను వివరించగా, వాటిని పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.గ్రామంలో కలెక్టర్ పర్యటనను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చి ఆసక్తిగా గమనించారు.
Admin
Aakanksha News