Wednesday, 11 February 2026 08:54:33 PM

కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలి...

– కల్వకుర్తి తాలూకాను నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలి... – ఊరుకొండ జేఏసీ డిమాండ్...

Date : 12 January 2026 01:37 PM Views : 255

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మహబూబ్‌నగర్‌ జిల్లా : ఊరుకొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని, కల్వకుర్తి తాలూకాను నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఊరుకొండ జేఏసీ ఆధ్వర్యంలో మండలంలో గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమంలో మండల ప్రజలంతా భాగస్వాములు కావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అసెంబ్లీలో ఊరుకొండ మండలం పట్ల చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని జేఏసీ ప్రధానంగా కోరుతోంది. వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ జిల్లా ఓబీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ రిలే దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి.మూడో రోజు దీక్ష శిబిరంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు. ఇకపై రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు ఈ ఉద్యమానికి మద్దతుగా మాట్లాడారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొమ్ము రాజయ్య, కల్వకుర్తి తాలూకా జేఏసీ చైర్మన్ కానుగుల జంగయ్య, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తాడెం చిన్న, బోల్గం నరేందర్ గౌడ్, కొమ్మ గొని నాగరాజు గౌడ్, మైసయ్య, శివ ఉపసర్పంచ్, డాన్ శివ, రాజునారం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమం కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :